న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013 కింద హైకోర్టు న్యాయమూర్తులను దర్యా ప్తు చేసే అధికారం తనకు ఉందంటూ లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. లోక్‌పాల్ ఉత్తర్వు కలవరపెడుతోందని పేర్కొన్న సుప్రీంకోర్టు దీనిపై కేంద్రానికి, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీచేసింది.
ఒక హైకోర్టుకు చెందిన సిట్టింగ్ అదనపు న్యాయమూర్తిపై జనవరి 27న లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. అయితే, సంబంధిత హైకోర్టు న్యాయమూర్తి పేరును వెల్లడించవద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది.