ముంబై, జూలై 24 (నమస్తే తెలంగాణ): ముంబైలోని పశ్చిమ రైల్వే లోకల్ రైళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు గురువారం స్టే ఇచ్చింది. అయితే వారు తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అంతేకాకుండా బాంబే హైకోర్టు తీర్పును దృష్టాంతంగా పరిగణించాల్సిన అవసరం లేదని జస్టిస్‌లు ఎంఎం సుందరేశ్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.