Hemant Soren | హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్..! ఈడీకి ‘సుప్రీం’ నోటీసులు..!
Hemanth Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) స్పందన కోరింది.
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) స్పందన కోరింది. బెయిల్‌పై జార్ఖండ్ హైకోర్టు తీర్పులో జాప్యం, మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్టు చేయడాన్ని పిటిషన్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ మే 6లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ కేసులో సోరెన్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టు తీర్పును ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి వాదనలు వినిపించారు. కేసు విచారణను మళ్లీ మే రెండోవారంలో జిరగే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు ఏప్రిల్ 27న రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో సోరెన్‌కు షాక్ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. హేమంత్ సోరెన్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ సోదరుడు రామ్ సోరెన్ శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 12 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, విచారణ సందర్భంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

