న్యూఢిల్లీ: తన అధికారిక పోర్టల్‌ను పోలిన నకిలీ వెబ్సైట్లు పుట్టుకురావడంతో సుప్రీంకోర్టు ప్రజలను హెచ్చరించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ (టెక్నాలజీ) హర్గుర్వరిందర్ సింగ్ జగ్గీ ఈ మేరకు ఓ ప్రకటనలో హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉందని, ప్రజల సున్నితమైన సమాచారాన్ని అక్రమంగా రాబట్టుకోవడం కోసం మోసగాళ్లు ఆ నమ్మకాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
www.scigoin.com, అదే విధంగా judiciarycheck.in వంటి యూఆర్‌ఎల్స్‌తో ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. ఇవి ఫేక్ వెబ్సైట్లని చెప్పారు. సుప్రీంకోర్టు అధికారిక డొమైన్ www.sci.gov.in అని తెలిపారు.