Kumbh stampede | మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది (rejects plea). అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.
గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్ విఫలమైందంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు వేశారు. 30 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. దేశ వ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ పిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్ విశాల్ తివారీకి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సూచించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.
Also Read..
Maha Kumbh stampede | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లోక్‌సభలో గందరగోళం
Maha Kumbh Mela | వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు.. పూలవర్షం కురిపించిన అధికారులు
Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ