Aadhaar | న్యూఢిల్లీ: ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఆధార్ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రోడ్డు ప్రమాద బాధితుని వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డు తగిన పత్రం అని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎల్సీ)లో పేర్కొన్న పుట్టిన తేదీ ఆధారంగానే వయసును నిర్ణయించాలని స్పష్టం చేసింది.
ఆధార్ కార్డు వ్యక్తి పుట్టిన తేదీని రుజువు చేసే పత్రం కాదని ఉడాయ్ గతంలో ఓ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపింది. రోహ్తక్లోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఓ కేసులో తీర్పు ఇస్తూ.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వయసు (47)ను ఎస్ఎల్సీ సర్టిఫికెట్ ఆధారంగా లెక్కించి, రూ.19.35 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. అయితే హైకోర్టు ఆధార్ కార్డులోని వయసు (45) ఆధారంగా ఆ నష్టపరిహారాన్ని రూ.9.22 లక్షలకు తగ్గించింది.