NEET UG | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.
విదేశాలలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య చదవడానికి వెళ్లే వారు తప్పనిసరిగా నీట్-యూజీకి అర్హత సాధించాల్సిందేనని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) విధించిన నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ నిబంధన న్యాయమైనది, పారదర్శకమైదని, చట్టపరంగా ఎలాంటి అతిక్రమణలకు పాల్పడలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.