న్యూఢిల్లీ, మే 2: న్యాయ సూత్రాలను అనుసరించి తాము వెలువరించిన తీర్పులు చట్టంతో సమానమని, వాటిని అందరూ పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. న్యాయ సూత్రాలను ఎవరైనా ఉల్లంఘించవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యేందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. కింది కోర్టులు న్యాయ సూత్రాల ప్రకారమే పని చేస్తున్నాయా? లేదా? అనేది హైకోర్టులు పర్యవేక్షించాలని పేర్కొంది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏ అమానుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవారం వ్యాఖ్యానించింది.