Pawan Khera | పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..!
Pawan Khera | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది.
Pawan Khera : కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sharma) భార్య రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sharma) కు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. దాంతో రిణికి భూయాన్.. పవన్ ఖేరాపై పరువు నష్టం కేసు వేసింది. దాంతో పవన్ ఖేరా ముందస్తు బెయిల్ కోసం గువాహటి హైకోర్టు (Gauhati High Court) లో పిటిషన్ వేశారు. హైకోర్టు ఖేరా పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఖేరా పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.
పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ కోసం పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. నిర్బంధ విచారణతో అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇది పరువు నష్టానికి సంబంధించిన అంశమని గుర్తుచేశారు. ఈ కేసులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాను చట్టాలకు అతీతం అన్న రీతిలో స్పందించారని, ఆయన రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వల్లే పవన్ ఖేరా అరెస్టుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వవన్ ఖేరాపై నమోదైన కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద బెయిల్ పొందే అవకాశం ఉందని, మరికొన్ని సెక్షన్ల కింద అసలు అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని సింఘ్వి వాదించారు. అస్సాం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి భార్య పాస్ పోర్టులకు సంబంధించిన నకిలీ కాపీలను పవన్ ఖేరా చూపించారని ఆరోపించారు. ఆయన చూపించిన కాపీలన్నీ అవాస్తవమే అన్నారు. పరారీలో ఉండి వీడియోలు విడుదల చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

