Supreme Court | న్యూఢిల్లీ, మార్చి 1: మెరుగైన పాలన కోసం చట్టసభ సభ్యుల కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ సందర్భంగా పిటిషన్‌దారుకు ధర్మాసనం తలంటింది.
ఎంపీ, ఎమ్మెల్యే కదలికలను మానిటరింగ్ చేయటం వారి గోప్యతా హక్కుకు భంగమని పేర్కొన్నది. మీరు చెప్పినట్టు చేయాలంటే సభ్యుల శరీరాల్లో చిప్ అమర్చాలా? అని పిటిషన్‌దారును ప్రశ్నించింది. అనవసర అంశాలతో కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.5 లక్షల జరిమానాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దోషుల విషయంలో ఆలోచించవచ్చు కానీ.. సభ్యులంతా దోషులంటే ఎలా? అని నిలదీసింది.