Supreme Court | ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం.. తిరస్కరించిన సుప్రీంకోర్టు..!
Supreme Court | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner), ఎన్నికల కమిషనర్ (Election Commissioner) నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సభ్యత్వాన్ని తొలగిస్తూ.. కొత్త చట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టును కోరింది.
Supreme Court : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner), ఎన్నికల కమిషనర్ (Election Commissioner) నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సభ్యత్వాన్ని తొలగిస్తూ.. కొత్త చట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టును కోరింది. అయితే కేంద్రం అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తాను ‘శబరిమలలో మహిళల ప్రవేశం’ కేసును పర్యవేక్షిస్తున్నందున కేసును కొద్ది రోజులపాటు వాయిదా వేయాలని కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Thushar Meheta) న్యాయస్థానాన్ని కోరారు.
కాగా తుషార్ మెహతా అభ్యర్థనను జస్టిస్ దీపాంకర్ దత్త తిరస్కరించారు. ఈ పిటిషన్‌పై విచారణ అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే విచారణ తేదీని ఖరారు చేశామని, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని స్పష్టంచేశారు. శబరిమల కేసును అసలు విచారించకపోవడమే మంచిదని మంగళవారం 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసం చేసిన వ్యాఖ్యలను జస్టిస్ దత్తా ప్రస్తావించారు. కాగా సీఈసీ, ఈసీ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) స్థానంలో కేంద్రమంత్రిని తీసుకునేందుకు ప్రతిపాదిస్తూ కేంద్రం చట్టం చేసింది. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించుకునే అవకాశం ఉందని పలువురు ఆందోళన లేవనెత్తారు.
ఇప్పటికే ఈ చట్టం కింద జరిగిన నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై విచారణ జరుగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

