ఆస్తులను వారసులకు రాసిచ్చి, తర్వాత వారు చూడకపోవడంతో వృద్ధాప్యంలో తీవ్ర నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా సుప్రీం కోర్టు చార్రితక తీర్పును వెలువరించింది. పిల్లలు తమను చూసుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి పత్రాలను రద్దు చేసే హక్కు వృద్ధ తల్లిదండ్రులకు ఉంటుందని తీర్పు చెప్పింది.
వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ చట్టం, 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ నిబద్ధతను ఈ తీర్పు నొక్కి చెబుతుందని జస్టిస్‌లు సీటీ రవికుమార్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆస్తులను తమ సంతానం, వారసులకు రాసిచ్చిన అనంతరం వారిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ తీర్పు సీనియర్ సిటిజన్ల హక్కును పరిరక్షిస్తుందని, వారికి రక్షణ కల్పిస్తుందని తెలిపింది.