న్యూఢిల్లీ: కర్వా చౌత్ పండుగను వైవాహిక స్థితితో సంబంధం లేకుండా మహిళందరికీ తప్పనిసరి చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెర ముందుకు రాలేని కొందరు వ్యక్తులు డబ్బిచ్చి ఈ పిటిషన్ వేయించారని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
ఇలాంటి పిటిషన్లు ప్రజలకు ఉపయోగపడవని, న్యాయ ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తాయని పేర్కొంది. గతంలో ఇలాంటి పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్ట్ పనికిరానిదిగా కొట్టేస్తూ పిటిషనర్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది.