న్యూఢిల్లీ: దేశంలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ తాత్కాలిక నివేదికను సమర్పించింది. దిగుబడులు తగ్గడం, సాగుకు సంబంధించిన ఖర్చులు, అప్పులు పెరిగిపోవడం, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం తదితర అంశాలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణాలని స్పష్టం చేసింది.
వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో భాగంగా రైతులకు ప్రత్యక్ష ఆదాయ తోడ్పాటును అందించేందుకు, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని కమిటీ సూచించింది.