Supreme Court | న్యూఢిల్లీ: దేశంలోని వివిధ న్యాయస్థానాలలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న క్రమంలో వాటి పరిష్కారానికి అడ్హక్ జడ్జీలను నియమించుకునేందుకు హైకోర్టులకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం న్యాయమూర్తులలో వీరి సంఖ్య 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది.
హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి 2021, ఏప్రిల్ 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని నిబంధనలను నిలిపివేస్తూ, మరికొన్నింటిని మినహాయిస్తూ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గత తీర్పు ప్రకారం.. హైకోర్టులలో మొత్తం జడ్జీల సంఖ్యలో 80 శాతం మంది అప్పటికే ఉంటే తాత్కాలిక జడ్జీలను నియమించ రాదని పేర్కొన్నారు.