న్యూఢిల్లీ : ఎన్నికల పోలింగ్ జరిగేటపుడు చిత్రీకరించిన సీసీటీవీ వీడియోలను భద్రపరచాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ప్రతి పోలింగ్ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఇందు ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై స్పందించేందుకు సమయం కావాలని ఈసీ తరపు న్యాయవాది కోరారు. ఎన్నికల నిబంధనలు, 1961కి ఇటీవల చేసిన సంస్కరణలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఈసీలను సుప్రీంకోర్టు జనవరి 15న ఆదేశించింది.