న్యూఢిల్లీ: 27 ఏండ్ల క్రితం 13 మంది అమాయకుల చావుకు, 38 మంది పౌరుల గాయాలకు కారణమైన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. 1996లో న్యూఢిల్లీలో ప్రముఖమైన లజ్పత్ నగర్ మార్కెట్లో జరిగిన బాంబు పేలుడు కేసు విచారణలో ట్రయల్ కోర్టు జాప్యం దేశ భద్రతలో రాజీ పడినట్టు ఉన్నదని విమర్శించింది.
ఈ కేసును అత్యవసరంగా పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన ఈ కేసులో దోషులైన మహ్మద్ నౌషద్, మీర్జా నిస్సార్ హుస్సేన్, మహ్మద్ అలీ భట్, జావేద్ అహ్మద్ ఖాన్కు జీవిత కాల కారాగార శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది.