టార్గెట్ చేసి కూల్చొద్దు.. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు
ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను ఉపయోగించవచ్చునని, అయితే టార్గెట్ చేస్తూ ఎవరిపైనా వాటిని ఉపయోగించ రాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
- ధిక్కరణ పిటిషన్ల విచారణ హైకోర్టుల్లోనే
న్యూఢిల్లీ, జూలై 16: ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను ఉపయోగించవచ్చునని, అయితే టార్గెట్ చేస్తూ ఎవరిపైనా వాటిని ఉపయోగించరాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రతి కేసులోనూ చట్టపరమైన ప్రక్రియను అనుసరించారా లేదా అనే విషయాన్ని హైకోర్టులు పరిశీలించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. బుల్డోజర్లను ఉపయోగించి ఏకపక్షంగా కూల్చివేతలు జరుపుతున్నారన్న ఆరోపణలపై దాఖలైన పలు ధిక్కారణ పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
బుల్డోజర్ల చర్యలపై అన్ని వేళలా నిషేధం (బ్లాంకెట్ బ్యాన్) విధించలేమని పేర్కొన్న సుప్రీం.. ప్రజలను శిక్షించడానికి లక్ష్యాలను ఎంపిక చేసుకోకూడదని స్పష్టంగా వ్యాఖ్యానించింది. బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు 2024 నవంబర్లో ఇచ్చిన తీర్పును, అందులోని మార్గదర్శకాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పలు రాష్ర్టాల నుంచి దాఖలైన పిటిషన్ల విచారణను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆ వివాదాలను సంబంధిత హైకోర్టులే విచారించాలని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

