న్యూఢిల్లీ: తండ్రి వద్దని, తన దారి తాను చూసుకొంటాననుకొనే మేజర్ కూతురికి.. ఆ తండ్రి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 18 ఏండ్లు నిండిన కూతురు తండ్రితో బంధం తెంచుకొంటే ఆమె విద్య, పెండ్లి తదితరాలకు అయ్యే ఖర్చును భరించాల్సిన అవసరం తండ్రికి లేదని వివరించింది. డబ్బు అడిగే అధికారం కూడా ఆ కూతురికి లేదని తేల్చి చెప్పింది. 20 ఏండ్ల ఓ యువతి కేసులో గురువారం అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.