న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీతో పాటు చట్టుపక్క ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారం రోజుల పాటు వర్క్ఫ్రమ్హోమ్ ఇవ్వాలని ఇవాళ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కార్యాచరణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు కోరింది. విషపూరితంగా మారిన వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు మంగళవారం సమావేశమై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్కు సుముఖత వ్యక్తం చేసింది. ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పూర్తి లాక్డౌన్ అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్ తెలిపింది. లాక్డౌన్ పెడితే కొంత వరకు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉందని గత విచారణలో సీజే పేర్కొన్న విషయం తెలిసిందే.