న్యూఢిల్లీ : అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లను ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల పేర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించకూడదని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
2018 నాటి తన తీర్పులో ఏ వ్యక్తి అయినా తమ ఆదేశాలను ఉల్లంఘించి బాధితుల పేర్లను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ముద్రించడం, ప్రచురించడం చేయకూడదని ఆదేశించింది. ఇది వరకు వెల్లడించిన తీర్పుల్లో బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను ప్రస్తావించడంతో వారికి ఎదురయ్యే కళంకం గురించి తెలియకపోవచ్చని ధర్మాసనం పేర్కొన్నది.