న్యూఢిల్లీ, జూన్ 23 : సైబర్‌క్రైమ్ నేరస్థులపై ముందస్తు నిర్బంధ చట్టాలను ఉపయోగించడంలో తమిళనాడు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశంసించింది. సైబర్ నేరానికి పాల్పడిన ఓ నిందితుడిపై ముందస్తు అరెస్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సందీప్ మెహతా విచారణ జరుపుతూ సైబర్ నేరాలకు పాల్పడే నేరస్థులపై ముందస్తు అరెస్టు చట్టాలను ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించడం మంచి ధోరణని అన్నారు.
ఇది స్వాగతించతగిన వైఖరని, ఈ నేరస్థులపై సాధారణ క్రిమినల్ చట్టాలు విజయవంతంగా పనిచేయడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం జారీచేసిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో నిందితుడు అభిజీత్ సింగ్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ జోయ్మాల్యా బగ్చితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిసింది. కేసుతదుపరి విచారణ బుధవారం జరుగుతుంది.