న్యూఢిల్లీ : బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా దీనిని అమలు చేయాలని పేర్కొంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ) అమలును వ్యక్తిగత చట్టాల కిందకు వచ్చే సంప్రదాయాలు నిరోధించ లేవని, అంతేకాకుండా అది జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛను హరిస్తాయని సుప్రీం కోర్టు శుక్రవారం తన తీర్పులో పేర్కొంది. కేవలం ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడం పైనే దృష్టి పెట్టకుండా దీని అమలుకు అధికార యంత్రాంగం విశేష కృషి చేయాలని సూచించింది.