న్యూఢిల్లీ: ఐఏఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు.. సుప్రీంకోర్టు(Supreme Court) ముందస్తు బెయిల్‌ను మంజూరీ చేసింది. ఆమెపై చీటింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తప్పుడు రీతిలో ఓబీసీ సర్టిఫికేట్‌ను తీసి.. వికలాంగుల కోటా ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైనట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసును ఇవాళ సుప్రీం విచారించింది. జస్టిస్ బీవీ నాగర్నత, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. విచారణకు సహకరించాలని పూజా ఖేద్కర్‌ను కోరారు. ఆమె ఏం నేరం చేసిందని, ఆమె డ్రగ్‌లార్డ్ కాదు అని, ఉగ్రవాది కాదు అని, ఆమె 302 సెక్షన్ కింద నేరం చేసిందా, ఎన్డీపీఎస్ నేరానికి పాల్పడిందా, ఓ వ్యవస్థ లేదా సాఫ్ట్వేర్ ఉండాలని, విచారణను పూర్తి చేయండి, ఆమె అన్నీ కోల్పోయిందని, ఆమెకు ఎక్కడా ఉద్యోగం దొరకదని సుప్రీం బెంచ్ తన తీర్పులో పేర్కొన్నది.
కేసుకు సంబంధించిన పూర్వోపరాలను దృష్టిలో పెట్టుకుని, ఢీల్లీ హైకోర్టు పిటీషనర్‌కు బెయిల్ ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీసుకు చెందిన లాయర్ వ్యతిరేకించారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఆమె విచారణకు సహకరించడం లేదన్నారు. 2022 యూపీఎస్సీ అప్లికేషన్లో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టింది. కానీ యూపీఎస్సీ మాత్రం ఖేద్కర్‌పై చర్యలు తీసుకున్నది. క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఫేక్ ఐడెంటిటీ ఇస్తూ సివిల్ సర్వీసు పరీక్షకు హాజరైనట్లు ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.