న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను తక్షణం ఆదుకోవడానికి మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు డ్రైవర్లకు పని గంటలను అమలు చేసే విషయమై సంబంధిత రాష్ర్టాల విభాగాలతో సమావేశాలను నిర్వహించాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖను ధర్మాసనం ఆదేశించింది.
‘రోడ్డు ప్రమాదాలు పెరగడానికి వేర్వేరు కారణాలుండొచ్చు. అయితే బాధితులకు వెంటనే సాయం అందని కేసులున్నాయి. కొన్నిసార్లు వారు గాయపడకపోయినా వాహనాల్లో చిక్కుకుపోతున్నారు’ అని బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వెంటనే బాధితులను ఆదుకొనేందుకు రాష్ర్టాలు, యూటీలు తప్పనిసరిగా ప్రొటోకాల్ రూపొందించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువిచ్చింది.