న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర కార్టూన్లు వేసిన కార్టూనిస్టు హేమంత్ మాల్వియా(Hemant Malviya)కు సుప్రీంకోర్టు ఇవాళ ముందస్తు బెయిల్ మంజూరీ చేసింది. తన కార్టూన్ పట్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో మాల్వియా క్షమాపణలు చెప్పినట్లు జస్టిస్ అరవింద్ కుమార ఎన్వీఅంజారి తెలిపారు. ఒకవేళ కార్టూనిస్టు దర్యాప్తునకు సహకరించకుంటే అప్పుడు బెయిల్ ను రద్దు చేసే స్వేచ్ఛను పోలీసులకు కోర్టు వదిలేసింది. మాల్వియా తరపున వృందా గ్రోవర్ వాదించారు. క్షమాపణలు చెప్పామని, కానీ ఇప్పటి వరకు పిటీషనర్‌కు సమన్లు ఇవ్వలేదన్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత సమన్లు ఇస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నాటరాజ్ తెలిపారు.
ఓ లాయర్, ఆర్ఎస్ఎస్ వర్కర్ వినయ్ జోషీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాల్వియాపై మే నెలలో కేసు బుక్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అభ్యంతరకరమైన కార్టూన్లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేపి డిస్టర్బ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.