న్యూఢిల్లీ: మణిపూర్ పోలీసులు దాఖలు చేసిన కేసులో ఎడిటర్స్ గిల్డ్ (ఈజీఐ)కి చెందిన నలుగురు సభ్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా కల్పించిన రక్షణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. వారు దాఖలుచేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయటంపై మణిపూర్ ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈజీఐ సభ్యులకు నేరపూరిత చర్యలతో సంబంధం లేకున్నా ఎఫ్ఐఆర్ ఎలా నమోదుచేశారంటూ సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు లేదా మణిపూర్ హైకోర్టుకు బదిలీ చేయటంపై సెప్టెంబర్ 15న నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొన్నది.