న్యూఢిల్లీ: దేశంలో 75 శాతం జనాభా భూకంపాల ముప్పు ఎదుర్కొంటోందని.. భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టేసింది. ‘ముప్పు ఉందని ప్రతి ఒక్కరి నివాసాన్ని చంద్రుడిపైకి మారుద్దామా?’ అని ధర్మాసనం పిటిషర్‌ను ప్రశ్నించింది. ఇటీవల జపాన్‌లో పెద్ద భూకంపం వచ్చిందని పిటిషనర్ పేర్కొనగా.. మొదట మనం ఇక్కడికి అగ్ని పర్వతాలను తీసుకొచ్చాక జపాన్‌తో పోల్చుకోవచ్చని బెంచ్ చెప్పి ంది. ‘దీనిపై విధాన నిర్ణయాలు అవసరం. ఈ విషయమై కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ కోర్టు ఏమీ చేయలేదు. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం’ అని తెలిపింది. భూకంప ముప్పుపై కొన్ని వార్తా పత్రికల నివేదికలను ప్రస్తావించగా వాటి గురించి తమకు బాధ లేదని కోర్టు తెలిపింది.
పాక్ యూనివర్సిటీలో సంస్కృతం బోధన ; విభజన తర్వాత తొలిసారి
లాహోర్, డిసెంబర్ 12: దేశ విభజన అనంతరం తొలిసారిగా పాకిస్థాన్‌లో ఎన్నడూ చూడని ఒక ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (ఎల్‌యూఎంఎస్)లోని ఒక తరగతి గదిలో మహాభారతం, భగవద్గీతలోని కొన్ని భాగాల బోధనతో పాటు సంస్కృత శ్లోకాలు వినిపించాయి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ అధికారికంగా సంస్కృత భాషను బోధించడం ప్రారంభించి ఒక చారిత్రక చర్యకు శ్రీకారం చుట్టింది. భారత్‌లో ఎంతో ప్రసిద్ధి పొందిన మహాభారతం సీరియల్లోని ఐకానిక్ పాట ‘హై కథా సంగ్రామ్కి’ ఉర్దూ అనువాదాన్ని కూడా విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో సంస్కృత భాష పునర్జీవన యత్నానికి ముందు ఈ భాషపై నిర్వహించిన మూడు నెలల వర్క్ షాప్‌నకు విద్యార్ధుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సంస్కృతం పూర్తి స్థాయి కోర్సుగా ఆవిర్భవించిందని, వారు చెప్పారు.