Supreme Court | న్యూఢిల్లీ, జనవరి 4: ఓ కేసులో నిందితుడిని 15 గంటల పాటు నిరంతరాయంగా విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్‌ను చట్ట విరుద్ధ ఇసుక తవ్వకం. మనీలాండరింగ్ కేసులో నిరుడు ఈడీ అరెస్టు చేసి విచారించింది.
అయితే, ఈ కేసు ఉగ్రవాదానికి సంబంధించినది కాదని, ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించినదని గురువారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘ఈడీది అమానవీయ ప్రవర్తన. నిందితుడు బలవంతంగా వాంగ్మూలం ఇచ్చేట్టుంది’ అని వ్యాఖ్యానించింది.