న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, జాతీయత, నిజాయతీలకు సంబంధించిన దస్ర్తాల ధ్రువీకరణను వారి నియామక తేది నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
అభ్యర్థుల యోగ్యతా పత్రాలను ధ్రువీకరించిన తర్వాతనే వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ నెల 5న ధర్మాసనం తీర్పు చెప్పింది. బసుదేవ్ దత్తా అనే ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌ను ఉద్యోగ విరమణ చేయడానికి రెండు నెలల ముందు తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెడుతూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.