న్యూఢిల్లీ: బాలలపై లైంగిక నేరాల కేసుల విచారణ కోసం ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల విచారణ పూర్తి కావడానికి ఈ చట్టం నిర్దిష్ట గడువును విధించిందని తెలిపింది.
తగినన్ని ప్రత్యేక కోర్టులు లేనందు వల్ల ఈ గడువులోగా విచారణ పూర్తి కావడం లేదని పేర్కొంది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో కేసులపై దర్యాప్తుతో సంబంధం గల అధికారులకు అవగాహన కల్పించడానికి, అత్యధిక ప్రాధాన్యత ప్రాతిపదికపై పోక్సో కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.