Supreme Court: ఏఐ ఆధారిత నకిలీ తీర్పులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు: సుప్రీంకోర్టు
Supreme Court: కృత్రిమ మేధాతో తయారు చేసిన తీర్పులను ఎవరైనా కోర్టుల్లో ప్రదర్శిస్తే, వారిపై కఠినతరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత తీర్పు ఆదేశాలను వెరిఫికేషన్ చేసుకోకుండా కోర్టులు గడ్డుగా నమ్మరాదు అంటూ సుప్రీం పేర్కొన్నది. నకిలీ తీర్పులను ప్రదర్శించే న్యాయవాదులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: కృత్రిమ మేధాతో తయారు చేసిన తీర్పులను ఎవరైనా కోర్టుల్లో ప్రదర్శిస్తే వారిపై కఠినతరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. కోర్టు పూర్వ తీర్పు ఆదేశాలను వెరిఫికేషన్ లేకుండా గడ్డుగి నమ్మరాదు అంటూ సుప్రీం తెలిపింది. ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దివాళా కేసులో ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ పీఎస్ నర్సింహా, అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం కొట్టిపారేసింది. ఆ కేసులో నకిలీ, అమలులో లేని, ఊహాజనిత ఏఐ ఆధారిత తీర్పుల ఆధారంగా ఎన్సీఎల్టీ కోర్టు తీర్పు ఇచ్చినట్లు సుప్రీకోర్టు తెలిపింది.
ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా.. ఏఐ ఆధారిత అంశాలను సమర్పిస్తే, ఆ కేసుల్లో ఎవర్నీ సహించాల్సిన అవసరం లేదని సుప్రీం వెల్లడించింది. కోర్టులన్నీ కఠిన చర్యలు తీసుకోవాలన్నది. అలాంటి తీర్పులను సమర్పించే న్యాయవాదులు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు అవుతుందని కోర్టు తెలిపింది. ఓ నకిలీ, ఊహాజనిత ఏఐక ఆధారిత విషయాలపై ఆధారపడడం.. అది జడ్జీల నిర్లక్ష్యం అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ఏఐతో చేసిన నకిలీ తీర్పులను నమ్మి.. కోర్టులు తీర్పులు ఇవ్వడం చట్టం దృష్టిలో న్యాయమే కాదు అని ధర్మాసనం పేర్కొన్నది. నిర్ణయాత్మక ప్రక్రియలో ఒకవేళ నకిలీ అంశం వస్తే, ఆ నిర్ణయాలను పక్కన పెట్టాలని కోర్టు పేర్కొన్నది. కృత్రిమ మేధతో జరుగుతున్న న్యాయపరమైన మోసాలను పరిశీలించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ కమిటని ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది.
కోర్టు ముందు నకిలీ, ఊహాజనిత అంశాలను పొందుపరిచే లాయర్లపై చర్యలు తీసుకునే రీతిలో మార్గదర్శకాలను బీసీఐ రూపొందించాలని సుప్రీం తన ఆదేశాల్లో వెల్లడించింది. ఏఐ ఆధారిత నకిలీ తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థకు తీవ్ర ప్రమాదం ఉన్నట్లు సుప్రీం బెంచ్ చెప్పింది. నకిలీ ఆదేశాలను ప్రవేశపెట్టడం అంటే న్యాయ వ్యవస్థలోకి ప్రాణాంతక మిథైల్ ఐసోసయనేట్ రిలీజ్ చేయడమే అవుతుందని సుప్రీం బెంచ్ చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

