కోర్టు ధిక్కరణపై ఆవేశపడొద్దు
కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఓ డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది.
న్యూఢిల్లీ, జూలై 30: కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఓ డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, ఆ వైద్యుడి ‘డాక్టర్ లైసెన్స్’ను తిరిగి పునరుద్ధరించాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
కోర్టు ధిక్కరణ ఏ స్థాయిలో ఉంది, దాని తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ‘కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయబద్ధంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నది. అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు చేయనందుకు, జరిమానాగా సదరు డాక్టర్ లైసెన్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

