చెన్నై: మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. వారిలో మహా కవి శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడుమోలు మాలా, జస్టిస్ ఏఏ నక్కీరన్, జస్టిస్ ఎస్ సౌందర్, జస్టిస్ సుందరమోహన్, జస్టిస్ కె కుమరేష్బాబు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు.
శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా గత ఏడాది మార్చిలో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమెతోపాటు అక్కడ అదనపు న్యాయమూర్తులుగా ఉన్న ఐదుగురు ఇప్పుడు శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం కాబోతున్నారు. అదేవిధంగా అనంత్ రామనాథ్ హెడ్గే, కన్నన్కుజియిల్ శ్రీధరన్ హేమలేఖ పేర్లను కొలీజియం కర్ణాటక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా రికమెండ్ చేసింది.