ముంబై: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని బాంద్రాలో బాంబే హైకోర్టు కొత్త భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ కోర్టు భవనం న్యాయానికి ఆలయంలా ఉండాలి కానీ, ఏడు నక్షత్రాల హోటల్లా ఉండకూడదని పేర్కొన్నారు.
న్యాయమూర్తులు ఇకపై దేవుళ్లు కాదని, వారు సాధారణ పౌరులకు సేవ చేసేవారని ఉద్ఘాటించారు. కొత్త భవనం రాజభవనంలా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ఆడంబరాలకు దూరంగా నిర్మించాలని సూచించారు.