న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను ఆ వర్గం వారు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వారికి ఆ హక్కులు కల్పించే మార్గాన్ని చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.
జాయింట్ బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా భాగస్వామిని పేర్కొనడం లాంటి సామాజిక హక్కులను స్వలింగ వివాహం చేసుకున్న వారికి కూడా కల్పించాల్సి ఉన్నదని తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లసై ధర్మాసనం ముందు వారం నుంచి వాదనలు సాగుతున్నాయి.