న్యూఢిల్లీ: దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 12 కేసుల్లో అతడిని నిర్దోషిగా ప్రకటించి, అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. 13వ దైన ఒక బాలిక హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఆయనపై నేరారోపణలను రుజువు చేయలేకపోయారని న్యాయస్థానం ప్రకటించింది. నిందితుడిని దోషిగా నిరూపించడంలో సీబీఐ విఫలమైందని సుప్రీం వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని వ్యాపారవేత్త మోహింగిర్ సింగ్ పంథేర్ ఇంటికి వెనుక భాగంలోని ఒక మురికి కాలువలో ఎనిమిది మంది పిల్లల అస్థిపంజర అవశేషాలు 2006, డిసెంబర్ 29న బయటపడ్డాయి. ఆ సామూహిక హత్యలకు పంథేర్ ఇంటిలో పనివాడుగా ఉన్న సురేంద్ర కోలీయే దోషి అంటూ అతనిపై, యజమానిపై కేసులు నమోదు చేశారు.