Sunita Williams | న్యూఢిల్లీ, మార్చి 5 : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుంచి భూమి మీదకు తిరుగు ప్రయాణం ఎప్పుడు? అన్న దానిపై సందిగ్ధత నెలకొన్నది. తాము భూమిపైకి ఎప్పుడు వస్తామన్నది తెలియట్లేదని సునీత విలియమ్స్ తాజాగా వ్యాఖ్యానించారు. గత 9 నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉండిపోయిన వ్యోమగాములు, స్పేస్ నుంచి విలేకర్లతో వివిధ అంశాలపై ముచ్చటించారు. అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమయ్యే.. ఇక్కడికి వచ్చామని విలియమ్స్ విలేకర్లతో చెప్పారు. ఐఎస్ఎస్లో ఖాళీ సమయాన్ని గడిపేందుకు తనతో ఓ కార్డ్ గేమ్‌ను తీసుకొచ్చానని అన్నారు.