Sunita Williams | న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గత 8 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మార్చి 19న తిరిగి భూమిపైకి రానున్నారు. సీఎన్ఎన్తో మాట్లాడిన సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరు నెలల సుదీర్ఘ కాల మిషన్ కోసం మార్చి 12న ఐఎస్ఎస్కు వెళ్లనున్న క్రూ-10 మిషన్‌లోని వ్యోమగాములకు సునీతా, విల్మోర్ తమ బాధ్యతలను అప్పగిస్తారు. ఆ తర్వాత క్రూ-10 వ్యోమనౌకలో సునీతా, విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు.
వారిద్దరినీ వీలైనంత త్వరగా భూమి పైకి తీసుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో ప్రాక్టికల్‌గా వీలైనంత త్వరగా వారిని భూమి మీదకు తీసుకొస్తామని నాసా మంగళవారం ప్రకటించింది.