Sunetra Pawar: బారామతి బైపోల్స్.. తప్పుకున్న కాంగ్రెస్.. సునేత్ర పవార్ ఏకగ్రీవం !
Sunetra Pawar : బారామతి బైపోల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నది. దీంతో సునేత్ర పవార్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానున్నది. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తన భర్త స్థానం నుంచి సునేత్ర పోటీ చేస్తున్నారు.
ముంబై: మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గానికి జరగాల్సిన బైపోల్ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నది. దీంతో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం సునేత్ర పవార్(Sunetra Pawar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో బారామతిలో ఏప్రిల్ 23వ తేదీన ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పుకోవడంతో.. సునేత్ర పవార్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
పోటీ నుంచి తప్పుకోవాలని ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రీయా సూలే.. కాంగ్రెస్ పార్టీని వేడుకున్నారు. జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో సునేత్ర పవార్ భర్త అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల తర్వాత డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు. పవార్ కుటుంబానికి బారామతి సీటు కంచుకోట. 1991 నుంచి అజిత్ పవార్ ఆ స్థానం నుంచి విజయం సాధించారు. అంతకన్నా ముందు బారామతి సీటు నుంచి శరద్ పవార్ ప్రాతినిధ్యం వహించారు.
బారామతి ఎంపీగా ప్రస్తుతం సుప్రియా సూలే కొనసాగుతున్నారు. బైపోల్స్ నామినేషన్‌కు గురువారమే చివరి రోజు. అయితే బారామతి నుంచి తమ పార్టీ అభ్యర్థి అమర్ మోరే పోటీ చేయడం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్దన్ సప్కాల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

