పంజాబ్ పోరు : ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించాలని బాదల్ డిమాండ్
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విస్పష్ట మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపధ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
చండీఘఢ్ : పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విస్పష్ట మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపధ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను పంజాబీలు ఎవరూ నమ్మరని ఆప్ ప్రజాధనంతో ఒపీనియన్ పోల్స్‌ను నిర్వహిస్తోందని బాదల్ ఆరోపించారు.
పలు ఎగ్జిట్ పోల్స్ పంజాబ్‌లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ రెండో స్ధానానికి పరిమితమవుతుందని, బీఎస్పీతో కలిసి బరిలో దిగిన అకాలీదళ్ ఆ తర్వాతి స్దానంలో నిలుస్తుందని అంచనా వేశాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌ను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తోసిపుచ్చారు. ప్రజలు మార్చి 10 వరకూ ఓపిక పట్టాలని కోరుతూ ఏం జరుగుతుందో కేవలం ఈవీఎంలే వెల్లడిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ వ్యాఖ్యానించారు.
పంజాబ్ ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా ఉన్నాయని, గ్రామాల్లో ఆప్ ఉనికి లేదని అలాంటి పార్టీకి ఓట్లు ఎలా పడతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా పంజాబీల తీర్పు ఉంటుందని అన్నారు. పంజాబ్‌లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే పూర్తి విశ్వాసం తనకుందని స్పష్టం చేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో జోష్‌లో ఉన్న ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ తమ పార్టీకి 80 స్ధానాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

