న్యూఢిల్లీ, మార్చి 21: ప్రతిరోజూ భోజనానికి ముందు బాదం తినేవారిలో మధుమేహ ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. బాదం తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్నవారి రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని కనుగొన్నారు. 60 మంది భారతీయులపై పరిశోధకులు మూడేండ్లపాటు అధ్యయనం నిర్వహించారు. వారికి ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు 20 గ్రాముల బాదం పప్పులను తినిపించారు. వారికి షుగర్ టెస్టులు నిర్వహించగా, రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉన్నట్టు తేల్చారు. డయాబెటిస్ పురోగతి ఆగిపోయినట్టు గుర్తించారు.