Rahul Gandhi : అయోధ్యలో తాము బీజేపీని ఓడించిన తరహాలోనే గుజరాత్‌లోనూ కాషాయ పార్టీని మట్టికరిపిస్తామని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది స్పందించారు.
మతపరమైన ప్రాధాన్యత కలిగిన అంశాలపై మాట్లాడే సమయంలో సునిశితంగా, గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతకు త్రివేది హితవు పలికారు. ఇలాంటి అంశాలు మాట్లాడే ముందు రాహుల్ అహంకారం వీడి నిజాయితీతో, నిరాడంబరతతో మాట్లాడాలని అన్నారు.
విపక్ష నేతగా రాహుల్ పార్లమెంట్లో ఏ అంశాన్నైనా లేవనెత్తే స్వేచ్ఛ ఉంటుందని, కానీ ఆయన కేవలం విపక్షంలోనే లేరని, పలు రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉన్నారని త్రివేది గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల్లో మెరుగైన పాలన అందించాలని, తాము విపక్షంలో ఉన్నప్పుడు తాము అభివృద్ధి విషయంలో గుజరాత్ మోడల్‌ను దేశానికి చాటిచెప్పామని ఆయన పేర్కొన్నారు. అహంకారపూరిత మాటలు రాహుల్ మాట్లాడటం ఆయనకు తగదని వ్యాఖ్యానించారు.
Read More :
Jon Landau | హాలీవుడ్లో విషాదం.. ‘టైటానిక్’ మూవీ నిర్మాత కన్నుమూత