న్యూఢిల్లీ: చైనా నుంచి జపాన్ వెళ్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ప్రయాణికులను మరణం అంచు వరకు తీసుకు వెళ్లింది. జూన్ 30న చైనాలోని షాంఘై నుంచి జపాన్‌లోని టోక్యోకు వెళ్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం జేఎల్8696 బోయింగ్ 737 గాలిలో ఉండగా, హఠాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడటంతో 36 వేల అడుగుల ఎత్తు నుంచి 10 నిమిషాల వ్యవధిలో 26 వేల అడుగులు కిందకు జారింది. పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని కాన్సాయ్ విమానాశ్రయానికి తరలిస్తున్నట్టు ప్రకటించారు.