Subramanya Swamy | న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత నేత రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరసత్వం కేసులో కాపాడుతున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి శనివారం హెచ్చరించారు. రాహుల్ 2003లో బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారని, బ్యాక్ఆప్స్ అనే కంపెనీని లండన్‌లో ఏర్పాటు చేశారని, అందువల్ల ఆయన భారతీయ పౌరసత్వం చెల్లదని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు.
రాహుల్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మోదీ, షాలను స్వామి ఎక్స్ పోస్ట్‌లో నిలదీశారు. ఈ అంశంపై తాను 2019లో విదేశాంగ శాఖకు చేసిన ఫిర్యాదు నకలును ఈ పోస్ట్‌లో జత చేశారు. అయితే, ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి నోటీసు ఇచ్చినట్లు తెలుస్తున్నది.