న్యూఢిల్లీ: భారత నావికాదళం అమ్ములపొదిలోకి మంగళవారం ఐదో స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి ‘వజీర్’ చేరింది. ప్రాజెక్టు-75లో భాగంగా దేశీయంగా నిర్మించిన ఈ సబ్మెరైన్ ద్వారా భారత నేవీకి మరింత బలం చేకూరనున్నది.
వజీర్ను ఫ్రాన్స్ నావల్ గ్రూప్ భాగస్వామ్యంతో ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మరోవైపు మొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ‘అర్నాలా’ను చెన్నైలో లాంచ్ చేశారు. హిందూ మహాసముద్ర రీజియన్లో చైనా తమ కార్యకలాపాలు పెంచిన నేపథ్యంలో భారత నేవీ తన సామర్థ్యాన్ని పెంచుకొనే పనిలో ఉన్నది.