న్యూఢిల్లీ: యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఐఎస్ఎస్కు వెళ్లిన శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఖరారైంది. భూమి మీదకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం జూలై 14న చేపడుతున్నామని ‘నాసా’ గురువారం ప్రకటించింది.
‘యాక్సియం-4 పురోగతిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. మేం ఆ మిషన్ను అన్డాక్ చేయాలని భావిస్తున్నాం. ఇందుకు జూలై 14ను తాజా టార్గెట్గా నిర్ణయించాం’ అని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ మీడియాకు తెలిపారు.