ముజఫర్‌నగర్: పోలీస్ నియామక పరీక్ష రాయడానికి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు బయల్దేరిన నలుగురు అభ్యర్థులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని లబోదిబోమన్నారు. పరీక్ష కేంద్రానికి బదులు అడవిలోకి వెళ్లిపోయారు. బాధితుల కథనం ప్రకారం వారు పరీక్ష రాయడం కోసం ఘజియాబాద్, హపుర్ నుంచి బైకులపై బయల్దేరారు.
ఒక స్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకున్నారు. అయితే అది వారిని శామిల్లోని చందేడి గ్రామం దగ్గర ఉన్న అడవిలోకి తీసుకెళ్లింది. తాము దారి తప్పామని తెలుసుకున్న యువకులు తిరిగి పరీక్ష కేంద్రాన్ని వెతుక్కొంటూ వచ్చారు. అయితే అప్పటికే పరీక్ష ప్రారంభం కావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు.