‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం
కె-ర్యాంప్, చెన్నై లవ్‌స్టోరీ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కిరణ్ అబ్బవరం బలమైన లైనప్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన జాయ్ ఫిల్మ్స్ వారి ‘కేఏ 13’, సుకుమార్ రైటింగ్స్‌లో ‘కేఏ 14’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ‘కేఏ 15’గా ఓ భారీ మైథాలజీ మూవీని ఆయన ప్రకటించారు.
కె-ర్యాంప్, చెన్నై లవ్‌స్టోరీ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కిరణ్ అబ్బవరం బలమైన లైనప్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన జాయ్ ఫిల్మ్స్ వారి ‘కేఏ 13’, సుకుమార్ రైటింగ్స్‌లో ‘కేఏ 14’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ‘కేఏ 15’గా ఓ భారీ మైథాలజీ మూవీని ఆయన ప్రకటించారు. ‘ఇంద్రపుత్ర’ ఫస్ట్ చాప్టర్ పేరుతో తెరకెక్కనున్న ఈచిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకుడు. పురాణ ఇతిహాసాల్లోని ధర్మానికి, అధర్మానికీ మధ్య జరిగే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల తెలిపారు.
మైథాలజీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ అంశాలతో గ్రాండ్ స్కేల్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘ఇంద్రపుత్ర’ రూపొందనున్నదని, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనున్నదని, కిరణ్ అబ్బవరం ఇందులో శక్తివంతమైన సరికొత్త అవతారంలో కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్నది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కథ: కీర్తన్, స్క్రిప్ట్: తన్వీ ఎన్ దత్త, సహ నిర్మాతలు: కీర్తన్, కున్సుమ్ అరోరా, నిర్మాణం: జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

