న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లోని అడిడాస్ ఇండియా టెక్ హబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాటా సైంటిస్టులు, డాటా ఇంజినీర్లు ఉన్నారు. భారత్‌లోని తమ టెక్నాలజీ విభాగంలో కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు అడిడాస్ ధ్రువీకరించింది. ‘ఓక్లట్’కు ఇచ్చిన ఒక ప్రకటనలో అడిడాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
వ్యాపార అవసరాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. ‘అడిడాస్‌కు మా సహచరులు అందించిన అనేక సేవలకు మేము ఎంతో కృతజ్ఞులం. ఈ సమయంలో సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని సంస్థ తెలిపింది.